- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ మరణం గురించి నెటిజన్ పోస్ట్.. ఆయన రియాక్షన్ ఏంటంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. గత ఏడాది ‘కల్కి’ మూవీలో కీలక పాత్రలో నటించిన ఆయన బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ‘కల్కి-2’ (Kalki-2)సిద్ధమవుతున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూనే ఓ వైపు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా, అమితాబ్ బచ్చన్ అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈక్రమంలోనే ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. అసలు విషయంలోకి వెళితే.. ఆరోగ్యం గురించి ఓ సెషన్ నిర్వహించాడు.
ఇందులో భాగంగా.. మీ గాడ్జెట్స్‌ను బ్రేక్ చేయండి.. మీకు దిర్ఘాయుస్సు ఉంటుంది అని పోస్ట్ పెట్టారు. ఇక అది చూసిన ఓ నెటిజన్ మీరు సరైన సమయానికి పడుకోకపోతే త్వరగా చనిపోతారు అని రిప్లై ఇచ్చాడు. ఇక ఇది చూసిన ఆయన కాస్త ఘాటుగా స్పందించారు. ‘‘నా మరణం గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు. అంతా ఈశ్వరుని దయ’’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






