పవన్ కళ్యాణ్ గురించి అడిగిన నెటిజన్.. వద్దు బ్రో అంటూ కిరణ్ అబ్బవరం షాకింగ్ రియాక్షన్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 08:43:13  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)‘క’ సినిమాతో భారీ క్రేజ్ రాబట్టుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

పవన్ కళ్యాణ్ గురించి అడిగిన నెటిజన్.. వద్దు బ్రో అంటూ కిరణ్ అబ్బవరం షాకింగ్ రియాక్షన్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)‘క’ సినిమాతో భారీ క్రేజ్ రాబట్టుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ‘కె-ర్యాంప్’ (K-Ramp)చిత్రంతో రాబోతున్నాడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుండగా.. జైన్స్ నాని(Jains Nani) తెరకెక్కించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్‌పై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 18 రాబోతుంది. ఈ నేపథ్యంలో.. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కిరణ్ అబ్బవరంకు ఓ ప్రశ్న ఎదురైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా ‘ఓజీ’ మూవీ ఫస్ట్ డే ఎక్స్‌పీరియెన్స్ ఎలా అనిపించింది అని అడగ్గా.. దానికి కిరణ్ అబ్బవరం.. ‘‘వద్దు బ్రో ఇప్పుడు అలాంటి ప్రశ్నలు అడగకండి. ఇప్పుడు నా సినిమా ‘కె-ర్యాంప్’ రిలీజ్ కాబోతుంది.

నా ప్రశ్నకు సమాధానం చెబితే దాని కోసం ఎక్కువ వాడుకుంటున్నారేమో, ఇప్పుడు ఎక్కువ చెబితే టికెట్స్ తగ్గుతాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. నాకు అది వద్దు మని అన్నిసార్లు అభిమానం గురించి పదే పదే చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నా సొంత గుర్తింపును, కష్టపడి సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకోవడం లేదు. దయచేసి ఇబ్బంది పెట్టకండి’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ పేరును వాడుకుని హైప్ చేసే మార్గాన్ని అతను ఎంచుకోవాలని అనుకోవడం లేదని చర్చించుకుంటున్నారు. అలాగే కొందరు పవన్ గురించి చెప్పకపోవడంపై మండిపడుతున్నారు.

READ MORE ....

‘మెగా-158’ లో హీరోయిన్ ఫిక్స్.. మెగాస్టార్ సరసన బంపర్ ఆఫర్ అందుకున్న మలయాళ బ్యూటీ..

Next Story