మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు 'Nenu Super Woman' షో వచ్చేసింది!

by Disha Web Desk 10 |
మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు Nenu Super Woman షో వచ్చేసింది!
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడని మన చిన్నప్పటి నుంచి ఈ మాటను వింటూనే ఉన్నాం. కానీ వాస్తవానికి ప్రతి మగాడి విజయం వెనక మహిళలు కూడా ఉంటారన్నది కూడా అంతే నిజం. మహిళలు ఇంట్లో గరిట తిప్పుతూనే బయటికి వెళ్లి పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేస్తూ.. సొంతంగా వ్యాపారాలు చేస్తూ తన భర్తకు అండగా నిలుస్తున్నారు. అలాంటి మహిళా వ్యాపారవేత్తలకు ఒక మంచి అవకాశం ఆహా కల్పించింది. నేను సూపర్ ఉమెన్ అనే షో ద్వారా ఇలాంటి మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ షో నేటి నుంచి ప్రారంభమవ్వనుంది. ఈ షో గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. 'నేను సూపర్ ఉమెన్' ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి గోల్డెన్ డోర్ అన్నమాట. అంటే ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను వారు చేస్తారు. వాళ్ల ఐడియాలను సపోర్ట్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో కావలసినంత మనీ మనీ ఇన్వెస్ట్ చేస్తూ వారికి అండగా నిలబడతారు.

Read More: అక్షయ్ కుమార్ వల్ల డిప్రెషన్‌కు గురయ్యా.. స్టార్ నటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed