- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్సన్ మాస్టర్ ప్లాన్.. గ్లోబల్ స్టార్‌తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు!
ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథను మరొక హీరోతో చేయడం కామన్ అయిపోయింది.

దిశ, సినిమా: ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథను మరొక హీరోతో చేయడం కామన్ అయిపోయింది. సాధారణంగా ఇలాంటివి ఇండస్ట్రీలో ఎన్నో జరిగాయి. డేట్స్ సెట్ కాకపోతే వేరే హీరోతో మరో ప్రాజెక్ట్ చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు అలాంటి సిచ్చువేషన్‌లో ఉన్న తమిళ దర్శకుడు నెల్సన్(Nelson) సతమతమవుతున్నారు. ఇటీవల ‘జైలర్’ (Jailer)సూపర్ హిట్ అందుకున్న ఆయన.. రూ. 700 కోట్ల కలెక్షన్లతో లాభాలు పొందారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అప్పుడే నెల్సన్ తన తదుపరి ప్రాజెక్ట్ పనిలో పడిపోయారట. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో ఒక పవర్ ఫుల్ సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించనున్నారట. అయితే ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో.. నెల్సన్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు పలు వార్తలు వస్తున్నాయి. తారక్ సినిమాను పక్కకు నెట్టి.. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan)తో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా చరణ్‌ను కలిసి కథ కూడా వినిపించగా.. అది ఆయనకు నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నట్లు టాక్. ‘పెద్ది’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నెల్సన్ సినిమా మొదలుకానుందట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఈ విషయం తెలుసుకున్న వారు నెల్సన్ ప్లాన్ అదిరిపోయిందని అభిప్రాయపడుతున్నారు.






