Neharika : అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీ కోపంగా ఉందా.. క్లారిటీ ఇచ్చిన నిహారిక!

by Jakkula Samataha |
Neharika  : అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీ కోపంగా ఉందా.. క్లారిటీ ఇచ్చిన నిహారిక!
X

దిశ, సినిమా : గత కొన్ని రోజుల నుంచి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు వచ్చాయి. వారు విడిపోయారంటూ అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీకి అస్సలే పడటం లేదంటూ టాలీవుడ్‌లో గుస గుసలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బన్నీ తన మామయ్య పవన్ కళ్యాణ్‌ను కాదు అని, వైసీపీ నేతకు సపోర్ట్ చేస్తూ ప్రచారానికి వెళ్లడంతో రెండు ఫ్యామిలీస్ మధ్య అగ్గి రాజుకుంది. దీంతో దీనిపై నాగబాబు మండిపడుతూ.. వాడు మనవాడే కానీ పరాయోడు అంటూ ట్వీట్ చేయడంతో కొందరు ఇది అల్లు అర్జున్‌ను ఉద్దేశించే అన్నారంటూ అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ పై మండిపడటం, ఇద్దరి మధ్య ట్వీట్ల యుద్ధమే జరిగింది అని చెప్పాలి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్‌కు అల్లు ఫ్యామిలీ రాకపోవడం, ప్రమాణ స్వీకారం లో కూడా వారు కనిపించకపోవడంతో వీరి మధ్య విభేదాలపై వస్తున్న వార్తలు నిజమే అంటూ కొందరు తేల్చేశారు. కాగా, దీనిపై తాజాగా మెగా డాటర్ నిహారిక పరోక్షంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ..వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయ, అల్లు అర్జున్ ఎవరికి సపోర్ట్ చేస్తారో అది ఆయన వ్యక్తిగత విషయం. దానిపై మెగా ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి వ్యతిరేకత లేదు, అన్నట్లు ఆమె పరోక్షంగా కామెంట్స్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story