డీజే టిల్లు స్క్వేర్‌లో నేహాశెట్టి గెస్ట్ రోల్.. ఆమె ఎంట్రీతో ఏం జరగనుందో !

by Disha Web Desk 9 |
డీజే టిల్లు స్క్వేర్‌లో నేహాశెట్టి గెస్ట్ రోల్.. ఆమె ఎంట్రీతో ఏం జరగనుందో !
X

దిశ, సినిమా: డీజే టిల్లు మూవీ, హీరోయిన్ నేహాశెట్టి జాతకాన్నే మార్చేసింది. మొదటి చిత్రం‌తోనే రాధిక పాత్రలో ఊహించని క్రేజ్‌ దక్కించుకుంది. ప్రజెంట్ ఈ బ్యూటీ తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ.. యంగ్ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉండగా టిల్లు స్క్వేర్‌లో రాధిక కూడా ఉండబోతోందని సమాచారం. మొదటి నుంచి టిల్లు స్క్వేర్‌లో నేహాశెట్టి రోల్‌ కూడా ఉండదని సిద్ధూ జొన్నలగడ్డ చెప్తూ వచ్చాడు. కానీ మనం చూసినంత వరకు ఫస్ట్ పార్ట్‌లోనే ఆమె రోల్‌కు ఎండింగ్‌ కార్డ్ పడింది. అయితే రీసెంట్‌గా ఈ మూవీలో నేహాశెట్టి గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 3 నుంచి 4 నిమిషాల వరకు ఆమె పాత్ర ఉంటుందట. ఈ అప్‌డేట్‌లో నిజమెంతో తెలియదు కానీ, నేహా గనుక మూవీలో ఎంట్రీ ఇస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అంటున్నారు పలువురు.

Read More : DJ Tillu Fame Actress Neha Shetty Looks Ravishing in long outfit

Next Story