నెగిటివిటీ నన్ను మరింత మెరుగుపరిచింది.. తనను తొక్కేయాలనుకున్న వారికి ప్రియాంక స్ట్రాంగ్ కౌంటర్

by Mallepaka Hamsa |

నాపై ఒక పద్ధతి ప్రకారం నెగిటివ్ ప్రచారం జరిగింది. అది నేరుగా నాపై జరుగుతున్న దాడి అని నాకు ఆలస్యంగా అర్థమైంది.

నెగిటివిటీ నన్ను మరింత మెరుగుపరిచింది.. తనను తొక్కేయాలనుకున్న వారికి ప్రియాంక స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్(Priyanka Mohan) గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై ఎట్టకేలకు నోరు విప్పారు. తనను టార్గెట్ చేస్తూ జరిగిన ఈ విద్వేషపూరిత ప్రచారం వెనుక ఉన్న అసలు కారణాలను ఆమె తనదైన శైలిలో బయటపెట్టారు. సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సౌత్ ఇండియాలోని పలువురు స్టార్ హీరోహీరోయిన్లను డీల్ చేసే ఒక ప్రముఖ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ సంస్థ నుండి ప్రియాంక బయటకు రావడమే ఈ వివాదానికి కారణం అని టాక్. ఆ సంస్థతో ఆమె తెగదెంపులు చేసుకున్న వెంటనే, సోషల్ మీడియాలో ఆమెపై అకస్మాత్తుగా విమర్శలు, నెగిటివ్ పోస్ట్‌లు వెల్లువెత్తాయని తెలుస్తోంది. ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేసి చేయిస్తున్న ‘టార్గెటెడ్ క్యాంపెయిన్’ అని అప్పట్లోనే ఆమె అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నాపై ఒక పద్ధతి ప్రకారం నెగిటివ్ ప్రచారం జరిగింది. అది నేరుగా నాపై జరుగుతున్న దాడి అని నాకు ఆలస్యంగా అర్థమైంది’’ అని అంగీకరించారు. అయితే, ఆమె ఏ ఒక్క వ్యక్తి పేరును కానీ, ఏ సంస్థ పేరును కానీ నేరుగా నిందించలేదు. ‘‘ఈ ఇండస్ట్రీ చాలా అనిశ్చితమైంది. ఇక్కడ ఎవరికైనా ఏదైనా జరగొచ్చు. కానీ కింద పడితేనే పైకి ఎలా లేవాలో తెలుస్తుంది. ఈ అనుభవం నన్ను ఒక వ్యక్తిగా మరింత స్ట్రాంగ్ చేసింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రియాంక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక హీరోయిన్ సంస్థ నుండి బయటకు రాగానే ఆమె కెరీర్‌ను దెబ్బతీయడానికి ఇలాంటి పెయిడ్ ట్రోల్స్ వాడటం ఎంతవరకు సరైనదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రియాంక మాటలు విన్నాక.. ఆమెపై జరిగింది కుట్రపూరితమైన దాడి అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Next Story