డబ్బులు ఇచ్చి మరీ ‘ఖుషి’ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారు.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 6 |
డబ్బులు ఇచ్చి మరీ ‘ఖుషి’ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారు.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంతతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై మంచి విజయం సాధించింది. కలెక్షన్స్‌లోనూ మూడు రోజుల్లో 70 కోట్లు రాబట్టి దూసుకుపోతుంది.

తాజాగా, చిత్ర యూనిట్ వైజాగ్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. నేను ఇంట్లో ఉన్నా ఆ ప్రేమను ఫీలవుతున్నా. నా మీద, నా సినిమా మీద ఎటాక్స్ జరుగుతున్నాయి. మా ఖుషి మీద ఫేక్ బుక్ మై షో రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. వేలాది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, యూట్యూబ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందుకు కొంతమంది డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నా మీద, నా సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారు. ఇవన్నీ దాటుకుని అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ నెంబర్స్, సక్సెస్ అందుకుంటున్నాం. ఈ విజయానికి మీరే కారణం. మూడు రోజుల నుంచి చూస్తున్నా మీ ముఖాల్లో సంతోషం చూసి నాకు చాలా తృప్తిగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More: పవన్ కల్యాణ్ ‘OG’లో సూపర్ స్టార్ మహేష్ బాబు?



Next Story

Most Viewed