- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంపర్ ఆఫర్ అందుకున్న నజ్రియా.. స్టార్ హీరోతో రొమాన్స్‌కు సిద్ధం!
జ్రియా నజీమ్(Nazriya Nazim) తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: నజ్రియా నజీమ్(Nazriya Nazim) తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో ‘రాజా రాణి’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. నాని ‘అంటే సుందరానికి’ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైంది. గత ఏడాది ‘సూక్ష్మదర్శిని’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉంది. తాజాగా, నజ్రియా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) సరసన నటించబోతున్నట్లు టాక్. జితు మాధవన్(Jeetu Madhavan) దర్శకత్వంలో రాబోతున్న ‘సూర్య-47’ (suriya-47)లో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య ‘కరుప్పు’ షూటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇది పూర్తి అయిన తర్వాత ‘సూర్య-47’ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారు. ఇక నజ్రియా ఇందులో చాన్స్ అందుకోవడంతో అంతా సంతోష పడుతున్నారు. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఇందుకు సంబంధించిన పోస్టులు చూసిన నెటిజన్లు బంపర్ ఆఫర్ అందుకుందని అంటున్నారు.






