బాలకృష్ణ‌తో మరోసారి జతకట్టనున్న నయనతార..!

by Disha Web Desk 9 |
బాలకృష్ణ‌తో మరోసారి జతకట్టనున్న నయనతార..!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలకృష్ణ-నయనతార కాంబినేషన్‌లో వచ్చిన ‘‘సింహా, శ్రీరామరాజ్యం’’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ హిట్ కొట్టాయి. ఆ తర్వాత.. తమిళంలో వరుస సినిమాలతో అలరిస్తున్న ఈ తార బాలయ్యతో మరోసారి బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందని, ఆల్‌రెడీ ఈ హీరోతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాను చేస్తున్నారు. ‘భగవంత్ కేసరి’ టైటిల్‌‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే కంప్లీట్ కానుందట. ఇక ఈ ఏడాది దసరాకు ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇది సెట్స్‌పైనే ఉండగా.. బాబీ డైరెక్షన్‌లో బాలయ్య మరో సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్ చాలా గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా నయన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: సిద్ధూ జొన్నలగడ్డ.. ఈ సారి సినిమాలో ఏకంగా ఆరుగురితో అట?


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed