‘హాయ్’ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్ ఇచ్చిన నయనతార

by Mallepaka Hamsa |

హాయ్ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ, ఫస్ట్ సింగిల్ ‘కన్నకుజియా’ అప్‌డేట్‌ను నయన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది

‘హాయ్’ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్ ఇచ్చిన నయనతార
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తీరిక లేకుండా గడుపుతోంది. చేతినిండా అరడజనకు పైగా భారీ ప్రాజెక్టులతో సౌత్ ఇండియాను షేక్ చేస్తోంది. అయితే, ఈ సినిమాలన్నింటిలోనూ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘హాయ్’. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌తో నయన్ తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఇందులో యంగ్ హీరో కవిన్ సరసన నయనతార తొలిసారి జంటగా నటిస్తుండగా.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. విష్ణు ఎడవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ, ఫస్ట్ సింగిల్ ‘కన్నకుజియా’ అప్‌డేట్‌ను నయన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ మధురమైన గీతాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. జెన్ మార్జిన్ అందించిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను కచ్చితంగా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచడమే కాకుండా, విడుదలకు కూడా ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నయన్ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. కానీ విడుదల తేదీని మాత్రం సస్పెన్స్‌గా ఉంచింది. 7 స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కవిన్ లాంటి యంగ్ హీరోతో నయనతార చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ‘హాయ్’ మాత్రమే కాకుండా, లేడీ సూపర్ స్టార్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కన్నడ స్టార్ యష్ సరసన ‘టాక్సిక్’, మలయాళంలో నివీన్ పౌలీతో ‘డియర్ స్టూడెంట్స్’, అలాగే మలయాళ స్టార్ మమ్ముట్టితో ‘పేట్రియాట్’, ‘మూకుతి అమ్మన్-2’, ‘మన్నంగట్టి’ వంటి సినిమాలతో ఆమె ఫుల్ బిజీగా ఉంది. కానీ, వీటన్నింటికంటే ముందుగా ‘హాయ్’ సినిమాతోనే నయన్ థియేటర్లలో సందడి చేయబోతుండటంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.

Next Story