NBK 111: న‌య‌న‌తార‌కు మ‌రో ఆఫ‌ర్‌...కోట్ల‌ల్లో రెమ్యూన‌రేష‌న్ ?

by velandi.Saikiran |

హిస్టారికల్ కథ కావడంతో బాలయ్య సరసన నయనతార అయితేనే కరెక్ట్ గా ఉంటుందని గోపీచంద్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌.

NBK 111: న‌య‌న‌తార‌కు మ‌రో ఆఫ‌ర్‌...కోట్ల‌ల్లో రెమ్యూన‌రేష‌న్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న నందమూరి బాలయ్య, మరో నెలలో కొత్త సినిమా ప్రారంభించనున్నారు. గోపీచంద్ మలినేనితో మరో సినిమా తీసేందుకు బాలయ్య సిద్ధమయ్యారు. NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నవంబర్ ఏడో తేదీన పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించుకోబోతున్నట్లు టాక్. ఇప్పటికే బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా వచ్చి సక్సెస్ అయింది.

దీంతో మరోసారి గోపీచంద్ కు ఛాన్స్ ఇచ్చాడు నందమూరి బాలయ్య. ఇక ఈసారి మాస్ యాక్షన్ అంశాలతో పాటు రెండు కాలాలకు సంబంధించిన హిస్టారికల్ కథను గోపీచంద్ మలినేని సిద్ధం చేశాడట. టైం ట్రావెల్ లాంటి కథ అని చెబుతున్నారు. ఇందులో కూడా నందమూరి బాలయ్య డబుల్ రోల్ లో కనిపించే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. ఇప్పటికే బాలయ్యతో నయనతార చాలా అనే సినిమాలు తీశారు. హిస్టారికల్ కథ కావడంతో బాలయ్య సరసన నయనతార అయితేనే కరెక్ట్ గా ఉంటుందని గోపీచంద్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. రెమ్యూన‌రేష‌న్ ఎంతైనా ఇచ్చేందుకు చిత్ర బృందం సిద్ధం అయింద‌ని టాక్ వినిపిస్తోంది. క్లిక్

Next Story