సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో నయన్.. నార్త్‌లో పాగా వేయడం పక్కా..

by Nagaya |
సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో నయన్.. నార్త్‌లో పాగా వేయడం పక్కా..
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తుంది. ఇటీవలే షారుఖ్ సరసన ‘జవాన్’లో నటించి నార్త్ ఆడియన్స్‌ను అలరించిన ఆమె.. ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. రణ్‌వీర్ సింగ్, అలియా భట్ హీరోహీరోయిన్స్‌గా భన్సాలీ తెరకెక్కి్స్తున్న తాజా మూవీ ‘బైజు బావ్రా’లో ఓ కీలకపాత్రలో నయన కనిపించబోతుందని, ఇప్పటికే డైరెక్టర్ ఆమెతో చర్చలు జరిపినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇక సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో భాగం కావడాన్ని లక్కీగా భావించిన నయన్.. దీంతో కచ్చితంగా బాలీవుడ్‌లో ప్రత్యేక ముద్ర వేయగలుగుతానని భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక 1950 నాటి మ్యూజికల్ పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.Next Story