ఫ్యాన్స్‌కు బిర్యానీ వడ్డించిన నయనతార.. వీడియో వైరల్

by Disha Web Desk 2 |
ఫ్యాన్స్‌కు బిర్యానీ వడ్డించిన నయనతార.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార రీసెంట్‌గా ‘జవాన్’తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం ‘అన్నపూరణి’ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీ టీమ్ ఇందుకోసం వెరైటీ ప్రమోషన్స్ ప్లాన్ చేయగా.. నయన్ కూడా అటెండ్ అయింది. ఈ క్రమంలోనే కాలేజ్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయిన బ్యూటీ.. వారికి బిర్యానీ కూడా వడ్డించింది. హగ్స్, షేక్ హ్యాండ్స్ ఇస్తూ సందడి చేసింది. హీరో జై కూడా ఈ ప్రమోషన్స్‌లో పాల్గొని.. ఆమెతోపాటు అన్నం వడ్డించాడు. లేడీ ఫ్యాన్స్‌కు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అని హింట్ ఇస్తూ.. హ్యాపీగా గడిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నయన్ డౌన్ టు ఎర్త్‌గా బిహేవ్ చేయడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. నీలేశ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను జీ స్టూడియోస్ నిర్మించగా.. డిశంబర్ 1న థియేటర్స్‌లోకి వచ్చేసింది.



Next Story

Most Viewed