- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా హీరోకే కండిషన్లు... ఆ హీరోయిన్ తెగింపు ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ అంతా కాదు. ఆ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ అంతా కాదు. ఆ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది హీరోలు సక్సెస్ అయి ఇండస్ట్రీని వెళ్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi).. మెగా కుటుంబానికి సంబంధించిన అందరి హీరోలకు... పూల బాట వేసారని చెప్పవచ్చు. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి కే.. కండిషన్స్ పెట్టింది ఓ హీరోయిన్. అలా చేస్తే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ... మొండి పట్టు పట్టింది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు... సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార ( Nayanatara). తమిళ్ హీరోయిన్ నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఆమె తమిళ్, తెలుగు, కన్నడ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. నయనతార కు తెలుగులో మంచి ఫాలోయింగ్... ఉంది. పెళ్లి తర్వాత తెలుగులో ఎన్ని ఛాన్సులు వచ్చిన... నయనతార ఒప్పుకోలేదు.
కానీ అనిల్ రావిపూడి ( Anil Ravipudi), మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న... సినిమాకు మాత్రం నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సమయంలో.. దర్శకుడు అనిల్ రావిపూడి అనేక డిమాండ్లు పెట్టారట. సినిమా ప్రమోషన్లు, ఆడియో ఫంక్షన్లు అన్నిటికి హీరోయిన్ నయనతార హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు అంట. అయితే అలా చేయాలంటే కచ్చితంగా రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వాలని నయనతార కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి... చిత్ర బృందం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. లైన్ క్లియర్ అయింది. అలా మెగాస్టార్ చిరంజీవి సినిమాకి నయనతార కండిషన్ లో పెట్టినట్టయింది.






