ట్రాన్స్‌జెండర్ల పగ చాలా డేంజరస్.. థర్డ్ జెండర్‌తో పెట్టుకుంటే వదలరు..

by Disha Web Desk 10 |
ట్రాన్స్‌జెండర్ల పగ చాలా డేంజరస్.. థర్డ్ జెండర్‌తో పెట్టుకుంటే వదలరు..
X

దిశ, సినిమా : నవాజుద్దీన్ సిద్దిఖీ, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హడ్డి’. ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. 2.26 నిమిషాల నిడివి గల ట్రైలర్‌‌ను ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా మొదటిసారి ట్రాన్స్‌జెండర్‌గా కనిపించిన నవాజుద్దీన్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. ‘జనాలు ట్రాన్స్‌జెండర్లను చూసి ఎందుకు భయపడతారో తెలుసా? మా దీవెనలు పవర్‌ఫుల్. మా శాపం డేంజరస్. మా పగ అంతకన్నా డేంజరస్’ అని చెప్పే ఇంటెన్స్ డైలాగ్ ఆకట్టుకుంది. మొత్తానికి చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవిస్తుండే ‘రూకీ’ అనే ట్రాన్స్‌జెండర్.. ఆ కమ్యూనిటీలో చేరేందుకు అలహాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వెళ్లాడు? అక్కడ తనకు ఎదురైన సవాళ్లు ఏంటి? ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ తరఫున పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌ అనురాగ్ కశ్యప్ (అరుణ్)పై ఏవిధంగా పగ తీర్చుకున్నాడు? అనే పాయింట్ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అక్షత్ అజయ్ శర్మ, ఆదమ్య భల్లా దర్శకత్వం వహించిన క్రైమ్ డ్రామా ‘హడ్డి’ చిత్రాన్ని జీ స్టూడియోస్, ఆనందిత స్టూడియోస్ నిర్మించింది. ‘హడ్డీ’ క్రైమ్ వెంగేన్స్ డ్రామా సెప్టెంబర్ 7న ప్రీమియర్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Bigg Boss-7 కంటెస్టెంట్స్ లిస్ట్ కన్ఫర్మ్.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లే..!



Next Story

Most Viewed