మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నాచురల్ స్టార్ నాని

by Disha Web Desk 6 |
మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నాచురల్ స్టార్ నాని
X

దిశ, వెబ్‌డెస్క్: నాచురల్ స్టార్ నాని ఇటీవల మృణాల్ ఠాకూర్‌తో కలిసి ‘హాయ్ నాన్న’ మూవీతో పలకరించాడు. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం నాని హాయ్ నాన్న ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని, మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ ఈగ సినిమాలో నటిస్తున్న సమయంలోనే అందాల రాక్షసి సైతం తెరకెక్కుతోంది. ఈ రెండు మూవీస్ నిర్మాతగా సాయి కొర్రపాటి గారే వ్యవహరిస్తున్నారు. అందాల రాక్షసి సినిమాకు సంబంధించి వర్క్ స్టార్ట్ అవ్వగానే హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ఈగ షూటింగ్‌లో చెప్పేవారు. ఒక అద్భుతమైన అమ్మాయిని తీసుకున్నాము. ఆమెను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.

ఎవ్వరు అడిగాని బయట ప్రొడక్షన్స్‌కి ఇచ్చేది లేదు. లావణ్య గురించి లీక్ కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. దీంతో నేను ఎక్సైట్ అయి ఆమె ఫొటో చూపించమని అడిగాను దానికి సాయి ఒప్పుకోలేదు. కానీ సినిమా అయిపోయాక ఓ రోజు లావణ్యను చూసి మంత్రముగ్దుడిని అయ్యాను. రియల్ లైఫ్ అమ్మాయిలా అనిపించింది. హీరోయిన్ అంటే ఒక మోడల్ లేదా డాల్ లాగా ఉండాలి అనే దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎప్పటికైనా ఆమె ఒక గొప్ప హీరోయిన్ అయిపోతుందని అనుకున్నాను. అలాగే మారుతీతో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఓకే చేసిన తర్వాత మన సినిమా కోసం లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా ఎంపిక చేస్తాను అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed