- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'నాటు నాటు' సాంగ్ క్రెడిట్ అతనికే దక్కుతుంది: రాజమౌళి
'ఆర్‌ఆర్ఆర్'లోని 'నాటు నాటు' సాంగ్ క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే చర్చపై రాజమౌళి స్పందించాడు.

దిశ, సినిమా: 'ఆర్‌ఆర్ఆర్'లోని 'నాటు నాటు' సాంగ్ క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే చర్చపై రాజమౌళి స్పందించాడు. కొంతకాలంగా ఈ పాట క్రెడిట్ అంతా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణికి మాత్రమే చెందుతుందంటూ కొందరు నెట్టింట రచ్చ చేస్తున్నారు. కొంతమంది తారక్, చెర్రీలకంటున్నారు. మరికొంతమంది రచయితకంటూ పలు రకాల చర్చలకు దిగుతూ ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఆంగ్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడిన రాజమౌళి.. 'ఈ సినిమాలోని నాటు నాటు పాట క్రెడిట్ అంతా ప్రేమ్ రక్షిత్‌కే దక్కుతుంది. దానికోసం ప్రేమ్ రక్షిత్ చాలా కష్టపడ్డాడు. అతను ఊహించనంత ఎఫర్ట్స్ పెట్టాడు కాబట్టే ఆ పాటకు అంతటి గౌరవం దక్కింది' అని చెప్పుకొచ్చాడు. అలాగే రామ్ చరణ్‌ను తారక్ భుజాలపై ఎత్తుకొని చేసే ఫైట్ కూడా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫ్ చేశారంటూ ప్రశంసలు కురిపించాడు జక్కన్న.
Also Read..
'అమ్మా.. నీకోసం ప్రతీ చోట వెతుకుతున్నా'.. జాన్వీ ఎమోషనల్ పోస్ట్






