బాలీవుడ్ మరో ఆఫర్ కొట్టేసిన నేషనల్ క్రష్.. రెండోసారి ఆ హీరోతో రొమాన్స్..?

by I. Sairam |

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘ఛలో;(Chalo) సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది.

బాలీవుడ్ మరో ఆఫర్ కొట్టేసిన నేషనల్ క్రష్.. రెండోసారి ఆ హీరోతో రొమాన్స్..?
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘ఛలో;(Chalo) సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకుంది. ‘పుష్ప’(Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నది. కేవలం టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ భామ హిందీలో షాహిద్‌కపూర్‌(Shahid Kapoor)తో కలిసి ‘కాక్‌టెయిల్‌-2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ జోడీ మరో భారీ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలిసింది. ‘బధాయి హో’ ‘మైదాన్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. రొమాంటిక్‌ కామెడీ జోనర్‌లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో లేడీ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మైసా’లో నటిస్తున్నది.

అలాగే అల్లు అర్జున్(Allu Arjun)-కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ‌(Atlee) కాంబోలో ‘AA22’ వర్కింగ్ టైటిత్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నదట. ఈ సినిమాలో రష్మిక రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్‌గా కాకుండా, ప్రతినాయిక పాత్రలో కనిపించనుందట. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే గత కొంతకాలంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారు. వీళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారు. గతేడాది అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ కూడా చేసేకున్నారు. ఇక ఈ జంట ఈ నెల 26న ఉదయ్ పుర్ లో మ్యారేజ్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Next Story