- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది ప్యారడైజ్’ మూవీలో నేషనల్ అవార్డు విన్నర్.. అధికారిక ప్రకటన విడుదల
నేచురల్ స్టార్ నాని(nani), శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(nani), శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ‘ది ప్యారడైజ్’ (The Paradise)టైటిల్‌లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక మూవీ మేకర్స్ నిత్యం పలు అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాలో ఓ జాతీయ అవార్డు గ్రహీత నటించబోతున్నట్లు ప్రకటించారు. నేడు సోనాలి కులకర్ణి (Sonali Kulkarni)పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెష్ తెలుపుతూ.. ‘ది ప్యారడైజ్’ మూవీ టీమ్ పోస్ట్ పెట్టారు. 'రా స్టేట్‌మెంట్: గ్లింప్స్'లో ఆమె స్వరం ఇంటర్నెట్‌లో తుఫానుగా మార్చింది.
ఈ చిత్రంలో ఆమె నటన ఒక సంచలనం అవుతుందని తెలిపారు. అలాగే గ్లీన్ కలర్ చీరలో నగలు వేసుకున్న గార్జియస్ ఫొటోను షేర్ చేశారు. కాగా.. ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తుండగా.. కయ్యదు లోహర్, నాని సరసన రొమాన్స్ చేయనుంది. అనిరుధ్ రవిచందర్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలి, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం 8 భాషల్లో విడుదల కాబోతుంది. SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గ్రాండ్‌గా వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.






