బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు?

by velandi.Saikiran |

బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫఖ్రీ స్టెప్పులు వేయ‌నున్నాడ‌ట‌.

బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు?
X

దిశ‌, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు బాలయ్య. రాజకీయాలతో పాటు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఏడాదికి ఒక్కటైనా సినిమా రిలీజ్ చేసి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు బాలయ్య. అయితే అలాంటి నందమూరి బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరావేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ గురించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యతో చంద్రిక రవి స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫఖ్రీని గోపీచంద్ మలినేని ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. హైదరాబాద్ లో నిర్మించిన ప్రత్యేక సెట్ లో ఇవాళ్టి నుంచి షూటింగ్ జరగనుందని టాక్. బాలయ్య ఎనర్జీకి నర్గీస్ ఫఖ్రీ గ్లామర్ తోడైతే మరో హిట్టు ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Next Story