పవిత్రా లోకేష్‌తో నా పెళ్లిని ఎవరూ ఆపలేరు: Naresh

by GSrikanth |   (  Updated:2023-06-09 05:47:18  IST  )

టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ నరేష్-పవిత్రా లోకేష్ రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

పవిత్రా లోకేష్‌తో నా పెళ్లిని ఎవరూ ఆపలేరు: Naresh
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ నరేష్-పవిత్రా లోకేష్ రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. మే 26వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదల అనంతరం మీరు పెళ్లి చేసుకుంటారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నరేష్ స్పందిస్తూ.. తప్పకుండా చేసుకుంటాం. తమ పెళ్లిని ఎవరూ ఆపలేరు. తాము పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని బదులిచ్చారు. కాగా, మరోవైపు ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదలను ఆపాలని నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది.

Also Read..

మనువరాలి వయసున్న హీరోయిన్‌ను మూడో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో?

నరేష్ - పవిత్రా లోకేష్‌కు రమ్య రఘుపతి బిగ్ షాక్!

Next Story