- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నరేష్- పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ ట్విట్టర్ రివ్యూ.. (వీడియో)
నరేష్- పవిత్ర కలిసి నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ సినిమాకు MS రాజు దర్శకత్వం వహించారు.

దిశ, వెబ్ డెస్క్: నరేష్- పవిత్ర కలిసి నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ సినిమాకు MS రాజు దర్శకత్వం వహించారు. దీనిని నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించినట్లు సమాచారం. ఇటీవల మరణించిన సీనియర్ నటుడు శరత్ బాబు కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. నేడు మే 26న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. దీంతో మళ్లీ పెళ్లి చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఓ నెటిజన్ ‘మళ్లీ పెళ్లి’ కొత్త యుగపు ఎమోషనల్ డ్రామాని చాలా చక్కగా రూపొందించారు. ఇప్పటివరకు ఎంగేజింగ్ బేగం లాగా అనిపిస్తుంది. నరేష్- పవిత్రల సీన్స్ చాలా బాగున్నాయి’ అంటూ రాసుకొచ్చింది. మరి కొంత మంది పార్ట్-2 కూడా కావాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే చాలా వరకు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినట్టు తెలుస్తోంది.






