పవిత్రా లోకేష్‌ కోరిక తీర్చిన నరేష్

by Disha Web Desk 10 |
పవిత్రా లోకేష్‌ కోరిక తీర్చిన నరేష్
X

దిశ, వెబ్ డెస్క్: నరేశ్‌-పవిత్రా లోకేష్‌ల జంట సహాజీవనం చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ప్రస్తుతం పవిత్రా లోకేష్‌ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పవిత్రకు కన్నడలో పీహెచ్‌డీ చేయాలని కోరిక ఉండేదని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా కన్నడ యూనివర్సిటీ పీహెచ్‌డీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలను విడుదల చేసింది. విడుదలయ్యాయి. మొత్తం 981 పరీక్ష రాయగా.. అందులో పవిత్రా లోకేష్ సహా 259 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. కన్నడ విశ్వవిద్యాలయంలోని సీట్లను మెరిట్‌ ఆధారంగా కేటాయిస్తామని సుబ్బన్న రాయ్‌ తెలిపారు. దానిలో భాగంగా భాషా నికాయ ఆధ్వర్యంలో జరిగిన బెల్గాం ఎక్స్‌టెన్షన్ సెంటర్‌లో పరిశోధన చేసేందుకు పవిత్రా లోకేష్‌ కూడా వెళ్లారు. ఈ ఎంట్రన్స్ పరీక్ష మే 30న నిర్వహించారు. ఆ సమయంలో ఆమె వెంట నరేష్‌ కూడా వెళ్లారు. తాజాగా విడుదలైన ఫలితాలతో ఆమె చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. పవిత్రా లోకేష్‌కు కన్నడ యూనివర్సిటీలో సీట్‌ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను చూసిన నెటిజెన్స్ మొత్తానికి పవిత్రా లోకేష్‌ కోరికను నరేష్ తీర్చేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More: ఇన్నాళ్లకు నా కల నెరవేరింది.. ‘చంద్రముఖి-2’ హీరోయిన్

Next Story

Most Viewed