టాకీ పూర్తి చేసుకున్న ‘దిల్ వాలా’.. ఏప్రిల్‌లో విడుదల..?

by Disha Web Desk 13 |
టాకీ పూర్తి చేసుకున్న ‘దిల్ వాలా’.. ఏప్రిల్‌లో విడుదల..?
X

దిశ, సినిమా: నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్‌పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం ‘దిల్ వాలా’. దర్శకుడు వీరభద్రమ్ చౌదరి తెరకెక్కిస్తు్న్న క్రైమ్ కామెడీ వైజాగ్‌లో 20 రోజుల షూటింగ్‌తో టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరభద్రమ్ మాట్లాడుతూ.. ‘నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం కోసం చాలా ఖర్చు చేశారు. వైజాగ్‌లోని అందమైన లోకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించాం. వైజాగ్‌లోనే నరేష్ అగస్త్య, రాజేంద్రప్రసాద్, హీరోయిన్ శ్వేత అవస్తి, ప్రగ్యా నైనా, అలీ రెజాలపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటని చిత్రీకరించాం. దీంతో 95 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ చేయాల్సివుండగా.. బ్యాంకాక్‌లో ప్లాన్ చేస్తున్నాం. మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నాడు.

Next Story

Most Viewed