‘నారాయణ & కో’.. టీజర్ లాంచ్ చేసిన శేఖర్ కమ్ముల

by Disha Web Desk 13 |
‘నారాయణ & కో’.. టీజర్ లాంచ్ చేసిన శేఖర్ కమ్ముల
X

దిశ, సినిమా: యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న సినిమాను పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుండగా.. తాజాగా సినిమా టీజర్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. ‘టీజర్ చాలా ఫన్‌గా ఉంది. ఇలాంటి జోనర్ సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

ఓ రెండు గంటలు మనల్ని మనం మర్చిపోయి చూసే సినిమాలివి. ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది. చిన్నా చాలా చక్కగా తీశారు. యంగ్ టీం పని చేస్తున్న సినిమా చాలా కొత్తగా కనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’ అన్నారు. చివరగా విభిన్న కోణాల్లో తెరకెక్కించిన తమ చిత్రాన్ని ఘన విజయం చేయాలని దర్శకనిర్మాతలు కోరారు.

Also Read...

ఆమె ఫ్యాన్స్ నా ఇంటిపై రాళ్లు విసిరారు.. పేరు కూడా మార్చుకోమన్నారు


Next Story