- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైన రెండో రోజే ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నారా రోహిత్.. అసలేమైందంటే?
టాలీవుడ్ హీరో నారా రోహిత్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి ఓ ఇంటివాడయ్యాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నారా రోహిత్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి ఓ ఇంటివాడయ్యాడు. ‘ప్రతినిధి-2’ హీరోయిన్ సిరి లెళ్ల (siri lella)గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న ఆయన పెద్దలను ఒప్పించి అక్టోబర్ 31న పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల మధ్య ఏడడుగులు వేశారు. నారా రోహిత్(Nara Rohit) పెళ్లి ఫొటోలు వైరల్ అవుతుండటంతో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, నారా రోహిత్ ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. ‘‘మీ ఆశీర్వాదాలతో మా ప్రత్యేకమైన రోజును మరింత ప్రకాశవంతంగా చేసిన మా స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీ ప్రేమ మాకు బలాన్ని ఇస్తుంది. ఈ ఆనందమైన జ్ఞాపకాలను మేము ఎప్పటికీ గుర్తించుకుంటాము. పెద్దమ్మ, పెదనాన్న, లోకేష్ అన్న, బ్రాహ్మని వదిన, తేజస్విని, మామ, వరుంధర గారికి ధన్యవాదాలు. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన వారందరూ మీ మద్దతు, ప్రేమ ఆ హృదయాన్ని తాకింది. మా సోషల్ మీడియా స్నేహితులకు మీ ప్రేమ దూరం, కాలానికి మించి ప్రయాణిస్తుందని మాకు గుర్తు చేసింది. మా రోజును ప్రపంచవ్యతాప్తంగా మనుషులు పట్టుకోలేని మాయాజాలంతో నింపిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అని ఎమోషనల్ అయ్యారు.






