కళ్లు తెరిచి ఓటు వెయ్యండి.. లేకుంటే చచ్చిపోండి.. నారా రోహిత్ కామెంట్స్ వైరల్ (వీడియో)

by Disha Web Desk 7 |
కళ్లు తెరిచి ఓటు వెయ్యండి.. లేకుంటే చచ్చిపోండి.. నారా రోహిత్ కామెంట్స్ వైరల్ (వీడియో)
X

దిశ, సినిమా: ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆకట్టుకునే హీరో నారా రోహిత్ దాదాపు 5 ఏళ్లు తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే వస్తున్న సినిమా ‘ప్రతినిధి 2’. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్త దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రీ లుక్, కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక 2014లో వచ్చిన ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామ ‘ప్రతినిధి’ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాము’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో నారా రోహిత్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘ఇప్పటికైనా కళ్లు తెరవండి.. ఒళ్లు విరిచి బయటకు వచ్చి ఓటు వెయ్యండి.. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి.. అది కుదరకు పోతే చచ్చిపోండి’ అంటూ రోహిత్ చెప్పిన డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. కాగా.. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో ఈ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.




Next Story

Most Viewed