Nani Son Birthday: కొడుకు బర్త్‌డే.. క్యూట్ పిక్ షేర్ చేసిన నాని

by Disha Web Desk 10 |
Nani Son Birthday: కొడుకు బర్త్‌డే.. క్యూట్ పిక్ షేర్ చేసిన నాని
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన ‘దసరా” చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో వరుస ప్రమోషన్స్‌తో దూసుకుపోతున్నారు మూవీ టీమ్. తాజాగా నాని కొడుకు అర్జున్ బుధవారంతో 6 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేశాడు నాని. ఈ ఫొటోలో అర్జున్ విల్లు పట్టుకొని ఉన్నాడు. ఈ పిక్ చూసిన అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మురిసిపోతున్నారు.

Next Story

Most Viewed