కొత్త ప్రొఫైల్ పిక్‌తో నాని.. మాస్ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా!

by Disha Web Desk 13 |
కొత్త ప్రొఫైల్ పిక్‌తో నాని.. మాస్ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా!
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో రోజువారీ కూలీగా కనిపించనున్న హీరో.. ఇదే లుక్‌లో తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌ను అప్‌డేట్ చేశాడు. గజిబిజి జుట్టు, గడ్డంతో రగ్డ్ లుక్‌లో మీసాలు తిప్పుతూ కనిపించిన నాని ఊరమాస్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా, ఇటీవల విదులైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story

Most Viewed