మెగా ఫ్యాన్స్ కోసం భారీ త్యాగం.. అప్పుడు బాల‌య్య‌, ఇప్పుడు నాని ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రామ్ చరణ్, నానిలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని

మెగా ఫ్యాన్స్ కోసం భారీ త్యాగం.. అప్పుడు బాల‌య్య‌, ఇప్పుడు నాని ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రామ్ చరణ్, నానిలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్, ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేస్తూ స్టార్ హీరోగా మారిపోయారు నాని. ఇప్పుడు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాంటి వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది.

నాని నటించిన 'ది ప్యారడైజ్' , రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఒకే రోజు రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తావానికి 'ది ప్యారడైజ్' సినిమాను వచ్చే ఏడాది మార్చి 26వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రకటన విడుదలైంది. అటు రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా మార్చి 27వ తేదీన రిలీజ్ కానున్నట్లు తెలిపారు. అయితే దర్శకుడు బుచ్చిబాబు మాత్రం ఒకరోజు ముందుగానే అంటే మార్చి 26వ తేదీన పెద్ది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిన్న వెల్లడించారు. దీంతో ఒకే రోజున రెండు పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నట్లు చర్చ జరుగుతోంది.

అలా అయితే రెండు సినిమాలకు నష్టం జరుగుతుందని, అందులో ఒకరు డ్రాప్ అవుతారని టాలీవుడ్ ఇండస్ట్రీ లో చర్చ మొదలైనట్లు సమాచారం. మెగా అభిమానుల కోసం హీరో నాని వెనక్కి తగ్గుతాడని అంటున్నారు. మార్చిలో కాకుండా ఏప్రిల్ మొదటి వారంలో తన 'ది ప్యారడైజ్' సినిమాను నాని రిలీజ్ చేసుకుంటాడని టాక్ వినిపిస్తోంది. మొన్న OG సమయంలో కూడా నందమూరి బాలయ్య అఖండ 2 సినిమాను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అదే మెగా అభిమానుల కోసం నాని కూడా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Next Story