'అంటే సుందరానికి' లేటెస్ట్ అప్‌డేట్.. అంతా పూర్తి అంటున్న నేచురల్ స్టార్..

by Web Desk |
Ante Sundaraniki
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని తన లేటెస్ట్ మూవీ 'శ్యామ్ సింగరాయ్'తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. తన తదుపరి సినిమాను సైతం మొదలు చేసేశాడు. నాని హీరోగా, నజ్రియా హీరోయిన్‌గా 'అంటే సుందరానికి' అంటూ అందరినీ నవ్వించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. దీనిని నేచురల్ స్టార్ నానినే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

ఈ సినిమా షూటింగ్‌ ముగిసిందని నాని అఫీషియల్‌గా ప్రకటించేశాడు. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో మూవీ టీం అంతా కలిసి ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. అంటే ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టనుంది.



Next Story

Most Viewed