నెంబర్ '23'తో తారకరత్నకు ఉన్న లింక్ ఏంటీ?

by Dishafeatures2 |
నెంబర్ 23తో తారకరత్నకు ఉన్న లింక్ ఏంటీ?
X

దిశ, వెబ్ డెస్క్: గత నెల 27న గుండె పోటుతో బెంగళూరులోని హృదయాలయలో జాయిన్ అయిన తారకరత్న.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం మోడీ, సీఎంలు కేసీఆర్, జగన్, మాజీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు తారకరత్నకు నివాళులు అర్పించారు. తారకరత్న అకాల మరణం పట్ల నందమూరి ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇకపోతే 23 నెంబర్ తో తారకరత్నకు విడదీయరాని బంధం ఉందని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

విశ్వవిఖ్యాత నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు నట వారసుడిగా తారకరత్న సినీ అరంగేట్రం చేసి నేటికి 23 ఏళ్లు నడుస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తారకరత్న 23 సినిమాల్లో నటించాడు. గత నెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ కరెక్టుగా 23 రోజుల తర్వాత చనిపోయాడు. ఇక ఆయన చనిపోయింది కూడా 2023 సంవత్సరం కావడం గమనార్హం. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న ఇలా అర్ధాంతరంగా చనిపోవడం దురదృష్టకరమని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed