Taraka Ratna: నేడు తారకరత్న బర్త్ డే.. శోకసంద్రంలో ఫ్యాన్స్

by Phanindra |   (  Updated:2023-02-22 08:27:03  IST  )

నందమూరి తారకరత్న అకాల మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు

Taraka Ratna: నేడు తారకరత్న బర్త్ డే.. శోకసంద్రంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: నందమూరి తారకరత్న అకాల మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్న గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో 23 రోజులపాటు మరణంతో పోరాడిన ఆయన చివరికి ప్రాణాలు విడిచారు. ఇదిలావుంటే.. ఫిబ్రవరి 22న తారకరత్న 40వ పుట్టినరోజు కావడంతో తమ అభిమాన హీరోను తలచుకుంటూ ఫ్యాన్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన తారకరత్న.. సినిమాల్లో సత్తా చాటేందుకు 2002లో 'ఒకటో నెంబర్ కుర్రాడు'తో అరంగేట్రం చేశాడు. మొత్తం 21సినిమాల్లో హీరోగా నటించిన ఆయన పలు సినిమాల్లో ప్రతినాయకుడిగానూ మెప్పించారు. 2009లో విడుదలైన 'అమరావతి' సినిమాకుగానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డును తీసుకున్నారు. రిసెంట్‌గా 2022లో '9 అవర్స్‌' అనే వెబ్‌‌సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్‌గా నటించి ఆకట్టుకున్నారు. చివరగా 'సారధి' చిత్రంలో నటించగా ఈ సినిమా 2024లో విడుదలకానుంది. ఏదేమైనప్పటికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story