తారకరత్న భార్యను పట్టించుకోని నందమూరి ఫ్యామిలీ.. కన్నీరు పెడుతూ,తన కష్టంతోనే పిల్లల్ని పెంచుతున్న అలేఖ్య!

by Jakkula Samataha |

నందమూరి తారకరత్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుద్దీ. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో, టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదరగలేకపోయాడు. ఆయన చేసిన

తారకరత్న భార్యను పట్టించుకోని నందమూరి ఫ్యామిలీ.. కన్నీరు పెడుతూ,తన కష్టంతోనే పిల్లల్ని పెంచుతున్న అలేఖ్య!
X

దిశ, సినిమా : నందమూరి తారకరత్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుద్దీ. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో, టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదరగలేకపోయాడు. ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో తాను సినిమాలకు గుడ్ బై చెప్పి, రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపారు.

ఇక తారకరత్న ప్రేమ వివాహం: చేసుకున్న విషయం తెలిసిందే.కులాలు వేరు కావడంతో అలేఖ్య రెడ్డి, తారకరత్నను నందమూరి కుటుంబం చేరదీయలేదు. దీంతో తారక్ తన భార్యతో వేరుగా ఉంటూ వచ్చాడు. చాలా సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఆర్థిక పరమైన సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన తనకు తానే పరిష్కరించుకుంటూ తన జీవితాన్ని ముందుకు నడుపుతూ వచ్చాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక బాబు కూడా జన్మించాడు. ఇక అంతా బాగుంది, తన కుటుంబం కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంది, మేము కలుస్తాం అని కలలు కన్న తారక్, హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. దీంతో అలేఖ్య జీవితం చీకటిమయంగా మారిపోయింది. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి చనిపోవడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబం వీరికి అండగా ఉంటుంది, చేరదీస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అలేఖ్య చేసిన కామెంట్స్‌తో ఆ ఫ్యామిలీ వీరిని పట్టించుకోవడం లేదని అర్థం అవుతుంది అంటున్నారు తమ అభిమానులు.

అయితే అలేఖ్య తన ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని, ఇప్పటికైనా తారకర్న ఫ్యామిలీ, తన పేరెంట్స్ మిమ్ముల్ని పట్టించుకుంటున్నారా? కోడలిగా అంగీకరించి మీకు సపోర్టివ్‌గా ఉంటున్నారా అని అడిగాడు. దానికి ఆమె సమాధానం ఇస్తూ..ఆశ, నమ్మకాలే మనల్ని ముందుకు నడుపుతాయి. ఆ నమ్మకంతోనే తారక్, నేను ఇన్నేళ్లు మాజీవితాలను గడుపుతూ వచ్చాం.ఆయన ఎప్పుడూ తన నమ్మకాన్ని, ఆశను విడిచిపెట్టలేదు. నేను కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాను. ఖచ్చితంగా అది జరిగే రోజు వస్తుందని, నాకు నమ్మకం ఉంది. నా పిల్లలకు మంచి కుటుంబం ఉంటుందంటూ కామెంట్ చేసింది. దీంతో తన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తారక్ తల్లిదండ్రులు ఇప్పటికీ అలేఖ్యను పట్టించుకోవడం లేదు పాపం, తాను కష్టాలు పడుతూ తన పిల్లల్ని పెద్ద చేస్తుంది అంటూ ముచ్చటిస్తున్నారు.

Next Story