నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: నమ్రత ఎమోషనల్ వీడియో

by Disha Web Desk 6 |
నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: నమ్రత ఎమోషనల్ వీడియో
X

దిశ, సినిమా : మహేష్‌ బాబు సతీమణి, నటి నమ్రత తన ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్‌లు ఇవ్వడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తమ గారాల పట్టి సితారాను పొగిడేస్తూ నెట్టింట ఓ వీడియో షేర్ చేసింది. ఈ మేరకు సితారా సెకండరీ స్కూల్‌కు గ్రాడ్యుయేట్ అవుతోందని చెబుతూ సంబరపడిపోయిన నమ్రత.. ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. సెకండరీ స్కూల్‌కు గ్రాడ్యుయేట్ అవుతున్నందుకు కంగ్రాట్స్. నీవు అడుగు పెట్టిన ప్రతీచోట నీ కష్టంతో వెలిగిపోవాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో నీవు సాధించబోయే విజయాలకు ఆల్ ది బెస్ట్. నాన్న, అన్నయ్య, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం. సితారాకు అండగా నిలిచిన టీచర్లకు థాంక్స్’ అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి : Kiara Advani: సమ్మర్ స్కిన్‏కేర్ సీక్రెట్ చెప్పేసిన కియారా.. వాటికి దూరమేనట!


Next Story

Most Viewed