- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ నటిగా నమ్రత రీ ఎంట్రీ.. మహేష్‌తో నటించడంపై సంచలన కామెంట్స్!
మహేష్ బాబు భార్య, అందాల సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. బాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసి, తెలుగులోకి వంశీ సినిమాతో అడుగు

దిశ, సినిమా : మహేష్ బాబు భార్య, అందాల సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. బాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసి, తెలుగులోకి వంశీ సినిమాతో అడుగు పెట్టింది ఈముద్దుగుమ్మ. తర్వాత చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక మొదటి సినిమాతోనే మహేష్ బాబుతో లవ్‌లో పడిపోయింది. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు ఎండ్ కార్డు వేసి, తన కుటుంబాన్ని చూసుకోవడంలో నిమగ్నం అయిపోయింది. అంతే కాకుండా బిజెనెస్‌లు చూసుకుంటూ వస్తుంది.
అయితే చాలా రోజుల తర్వాత ఈ నటికి ఓ ప్రశ్న ఎదురైంది. మీరు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా? అని. దానికి స్పందించిన నమ్రత, మళ్లీ ఆ ఆలోచన లేదు, వచ్చే ఛాన్సే లేదు అని చెప్పింది. మరి మహేష్ బాబుతో కలిసి నటిస్తా అని అడగ్గా దానికి కూడా నో చెప్పేసింది. నాకు మళ్లీ నటించాలనే కోరిక లేదు అని తాను బ్యాకెండ్ వర్క్ చేస్తానని తన మనసులోని మాటలు బయటపెట్టింది. ఇక ప్రస్తుతం నమ్రత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






