- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'క్షణం ఒక యుగం': ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నక్కిన త్రినాధరావు
మనీష్, మధు నందన్, లావణ్య, అక్సా ఖాన్, అలివియా ముఖర్జీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'క్షణం ఒక యుగం'.

X
దిశ, సినిమా: మనీష్, మధు నందన్, లావణ్య, అక్సా ఖాన్, అలివియా ముఖర్జీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'క్షణం ఒక యుగం'. శ్రీ రూపా ప్రొడక్షన్ బ్యానర్‌లో రూపా నిర్మించిన చిత్రానికి సూర్ల శివ బాబు దర్శకత్వం వహించాడు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నక్కిన త్రినాధరావు చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 'పోస్టర్ చాలా బాగుంది. ఇది లవ్ స్టోరీ అయినప్పటికీ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది' అంటూ మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక అడిగిన వెంటనే తమ సినిమా పోస్టర్‌ను లాంచ్ చేయడానికి వచ్చిన త్రినాధరావుకు ధన్యవాదాలు చెప్పిన చిత్రబృందం.. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.
Next Story






