- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాలెంటైన్స్ డే కానుకగా ‘నాగిల్లా’ సినిమా.. చెమటలు పట్టిస్తున్నకార్తీక్ ఆర్యన్ కొత్త పోస్టర్..
ఈ చిత్రాన్ని 2027 ఆగస్టు 14న నాగపంచమి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, అనూహ్యంగా ఈ సినిమాను ప్రీపోన్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ‘నాగిల్లా’ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ధర్మా ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అదార్ పూర్ణవాలా వంటి దిగ్గజ నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఫక్రీ’ ఫేమ్ మ్రిగ్‌దీప్ సింగ్ లంబా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ముందుగా ఈ చిత్రాన్ని 2027 ఆగస్టు 14న నాగపంచమి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, అనూహ్యంగా ఈ సినిమాను ప్రీపోన్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే కానుకగా 2027 ఫిబ్రవరి 12న ‘నాగిల్లా’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. తాజాగా విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
ఈ పోస్టర్‌లో కార్తీక్ ఆర్యన్ చీకట్లో నగ్నంగా నిలబడి ఉండగా, ఆయన శరీరం చుట్టూ భయంకరమైన పాములు చుట్టుకుని ఉన్నాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే.. ఆయన తలపై ఒక పెద్ద నాగుపాము పడగ విప్పి, నాలుక బయటకు చాచి ఉండటం చూస్తుంటే ఒళ్ళు గగుర్పు పొడుస్తోంది. కార్తీక్ ఆర్యన్ లుక్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. కరణ్ జోహార్ నిర్మాణంలో కార్తీక్ ఆర్యన్ చేస్తున్న ఈ విభిన్నమైన ప్రయోగంపై బాలీవుడ్‌లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. పోస్టరే ఇంత భయంకరంగా ఉంటే, ఇక సినిమాలో విజువల్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రం కార్తీక్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.






