- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ స్టార్‌తో రొమాన్స్ చేయబోతున్న నాగార్జున బ్యూటీ.. వీరిద్దరి జంట సూపర్ అంటున్న ఫ్యాన్స్
కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంలో నటించింది.
ఈ మూవీలో ఈ భామ, యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక రీసెంట్‌గా కన్నడ స్టార్ హీరో సిద్ధార్థ్(Sidharth) సరసన ‘మిస్ యూ’(Miss You) మూవీలో నటించింది. అయితే ఈ చిత్రం కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తెలుగులో మాత్రం డిజాస్టర్‌గానే మిగిలింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ సుకుమార్(Sukumar)ల కాంబినేషన్ కూడా ఒకటని చెప్పాలి. కాగా ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి ఓ బిగ్ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు. కాగా ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాలో రామ్ చరణ్ రొమాన్స్ చేయనున్న హీరోయిన్స్ విషయంలో గత కొన్నాళ్ల నుంచి మంచి సస్పెన్స్ నడుస్తుంది. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.
రామ్ చరణ్ ఈసారి యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్‌తో రొమాన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ కోసం ఈమెని పెట్టాలని చూస్తున్నారట. సో ఇది నిజం అయితే మాత్రం గ్లోబల్ స్టార్‌తో ఈ నటి రొమాన్స్ చేయనుంది అని చెప్పవచ్చు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వీరిద్దరి జంట సూపర్‌గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE ...
Niharika : వాడు నా టెడ్డీ బేర్ అంటూ అతనితో ఉన్న రిలేషన్‌పై మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్






