- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగార్జున 100వ సినిమాపై బిగ్ అప్డేట్..ఇక ఫ్యాన్స్ కు జాతరే!
కింగ్ 100 మూవీని వచ్చే 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందుకు ఉంచుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను ఇండస్ట్రీలో రాణించడమే కాకుండా.. ఇద్దరు కొడుకులను కూడా తీసుకువచ్చాడు. అటు వ్యాపారాల్లో కూడా దూసుకు వెళ్తున్న అక్కినేని నాగార్జున... ప్రస్తుతం తన 100వ సినిమా పైన ఫోకస్ చేశాడు. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ మూవీలో ఇప్పటికే టబు ఫిక్స్ కాగా సుస్మితా భట్ కూడా ప్రత్యేక పాత్ర పోషించబోతున్నట్లు టాక్.
ఈ మూవీలో తన ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని ఇద్దరూ ప్రత్యేక పాత్రలో మెరిసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ మేరకు దర్శకుడు భారీ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాపై ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. కింగ్ 100 మూవీని వచ్చే 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. గతంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన అక్కినేని నాగార్జున సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. అదే సెంటిమెంట్ వర్కౌట్ చేసేందుకు ఇప్పుడు ఈ 100వ సినిమాను రిలీజ్ చేయనున్నారట.






