- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
NAGARJUNA-SOBHITA:పెళ్లికి ముందే కాబోయే కోడలిపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్లు
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగార్జున పెద్ద తనయుడు నాగచైతన్య అండ్ టాలీవుడ్ హీరోయిన్ సమంత లవ్ మ్యారేజ్ చేసుకొన్న విషయం తెలిసిందే. కానీ పలు కారణాల వల్ల సామ్-చై విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో నాగచైతన్య అక్కినేని అభిమానులకు భారీ షాక్ ఇచ్చాడు. హీరోయిన్ శోభితతో ఇవాళ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడట. సాయంత్రంలోపు వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో మారుమోగనున్నాయని అభిమానులంతా నెట్టింట తెగ సందడి చేస్తున్నారు.
మరోవైపు నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంటే ఓ వైపు నటసామ్రాట్ నాగార్జున కాబోయే కోడలిపై గతంలో చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గూఢచారి చిత్రం ఆడియో లాంచ్‌కు హాజరైన నాగార్జున..‘గూఢచారి చిత్రంలో శోభిత యాక్టింగ్ చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఇందులో ఆమె చాలా అందంగా ఉంది. శోభితలో ఏదో అట్రాక్షన్ ఉట్టిపడుతుంది’. అంటూ నాగార్జున చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.