- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Nagarjuna : సమంతతో విడాకులు.. ఇప్పుడు చైతూ సంతోషంగా ఉన్నాడంటూ, నాగార్జున షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా : అక్కినేని నాగచైతన్య సమంతను వివాహం చేసుకొని, నాలుగు సంవత్సరాల వరకు వీరు కలిసి ఉండి, ఆ తర్వాత మనస్పర్థల కారణంగా తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడాకులు తీసుకొని విడిపోయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి విడాకులపై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ అక్కినేని ఫ్యామిలీలో ఎవరూ దీనిపై డైరెక్ట్‌గా స్పందించలేదు. ఇక విడాకులనంతరం, సమంత సింగిల్‌గానే ఉన్నా, నాగచైతన్య మాత్రం నటి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఊహించని షాకిచ్చాడు. అక్కినేని నాగచైతన్య తన ఇంట్లో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో చాలా సింపుల్‌గా నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం చేశాడు.
ఈ క్రమంలోనే నాగార్జున చైతూ, సమంతల విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సమంతతో విడాకుల తర్వాత చైతూ చాలా బాధపడిపోయాడు. చై విడాకుల అనంతరం తన బాధను ఎవరితో పంచుకోలేదు, తనలో తానే నలిగిపోయాడు. ఇప్పుడు నా కుమారుడు సంతోషంగా ఉన్నాడు. శోభితా, చైతూ నిశ్చితార్థంతో మేము అందరం చాలా హ్యాప్పిగా ఉన్నాం, నాగచైతన్య కూడా ఆనందంగా ఉండటం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక పెళ్లి ఇప్పుడే కాదు, కాస్త టైం తీసుకుంటాం అని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read more...
Naga Chaitanya: నాగ చైతన్య తండ్రి కాలేడు.. సంచలన విషయం బయటపెట్టిన వేణు స్వామి!