స్టేజ్‌పైనే సమంత గురించి విజయ్ దేవరకొండను ప్రశ్నించిన నాగార్జున!

by Kodari Anjali |   (  Updated:2023-10-10 15:19:17  IST  )

బుల్లితెర ప్రేక్షకులంత ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 7.

స్టేజ్‌పైనే సమంత గురించి విజయ్ దేవరకొండను ప్రశ్నించిన నాగార్జున!
X

దిశ, సినిమా: బుల్లితెర ప్రేక్షకులంత ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 7. సీనియర్ స్టార్ హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ 7 లాంచ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు మొదలుకానుంది. ఇందులో భాగంగా సర్‌ప్రైజ్‍ ప్రోమోను రివీల్ చేశారు. ‘ఈ సీజన్‍ హౌజ్‍లో ఉండాలంటే అంత ఈజీ కాదు’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్‍తో ప్రోమో మొదలవగా ప్రోమోలో కొందరు కంటెస్టెంట్ల డైలాగ్స్, మాటలు మాత్రమే వినిపించారు. కానీ వారి ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ‘ఖుషి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ ‘బిగ్‍బాగ్ 7’ లాంచ్ ఈవెంట్‍కు అతిథిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు.

ఆరాధ్య పాటకు విజయ్ డ్యాన్స్ చేసి అలరించగా ఇంతలోనే నాగార్జున ‘మీ హీరోయిన్ సమంత ఎక్కడ’ అని విజయ్‍ను అడగటం ప్రోమోలో హైలైట్‍‌గా నిలిచింది. అలాగే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈవెంట్‍‌లో సందడి చేశాడు.

Next Story