బిగ్ బాస్ తెలుగు 'సీజన్ 6' కొత్త ప్రోమో!

by Disha Web Desk 7 |
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కొత్త ప్రోమో!
X

దిశ, సినిమా : బుల్లితెర రియాలిటీ షోస్‌లో 'బిగ్‌బాస్‌' క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీతో మొదలై పలు భారతీయ భాషలకు విస్తరించిన ఈ గేమ్‌షో.. ప్రతిచోటా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 4 నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానుంది. గత మూడు సీజన్లు హోస్ట్ చేసిన కింగ్ నాగార్జునే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా షోకు సంబంధించిన కొత్త ప్రోమోను ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు. కాగా ఈసారి స్టార్‌ యాంకర్‌ ఉదయభాను, దీపికా పిల్లి, శ్రీహాన్‌, నేహా చౌదరి, ఆర్జే సూర్య, అమర్‌దీప్‌, ఆది రెడ్డి, చలాకీ చంటి, గీతు రాయల్‌ తదితరులు బిగ్‌బాస్‌లో సందడి చేయనున్నారు.

Next Story

Most Viewed