- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
NAGARJUNA: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్‌కు ముందే శోభితకు కండిషన్ పెట్టిన నాగార్జున.. ఏంటంటే?
దిశ, సినిమా: ఇండస్ట్రీలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని విధంగా అక్కినేని హీరో నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని బిగ్ షాక్ ఇచ్చింది హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. ఆగస్టు 8 వ తేదీన ఇరుకుంటుంబ సభ్యుల సమక్షంలో చై-శోభితా అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు. సింపుల్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫొటోలతో పాటు అక్కినేని ఇంటి కోడలిగా వెళ్తోన్న శోభితా గురించి కూడా నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈ భామ ఎక్కడ చదువుకుంది? తల్లిదండ్రులు ఏం చేస్తారు, సినీ ఇండస్ట్రీకి రాకముందు శోభితా ధూళిపాళ్ల ఏం వర్క్ చేసేది, అసలు ఈమె జీవితంలో ఏం అవ్వాలనుకుంది? సినీ పరిశ్రమకు ఎలా వచ్చిందంటూ నెటిజన్లలో నానా సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మరో సంచలన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే నాగ చైనత్య-సమంత పెళ్లి విషయంలో తప్పు జరిగింది. కారణమేంటో తెలియనప్పటికీ విడాకులు తీసుకున్నారు. కాగా మరోసారి ఈ తప్పు రిపీట్ కాకూడదని నాగార్జున కాబోయే కోడలు శోభితకు ఓ కండిషన్ పెట్టారట.
సామ్-చై పెళ్లికి ముందు అక్కినేని ఫ్యామిలీ సమంతకు ఎలాంటి నిబంధనలు విధించలేదట. దీంతో వెబ్ సిరీస్‌ల్లో కాస్త బోల్డ్ గా నటించడంతో నాగ చైతన్యకు, సమంతకు మధ్య గొడవలు వచ్చాయని నెట్టింట టాక్ వినిపించింది. శోభితా కూడా బోల్డే కాబట్టి.. ఫ్యూచర్‌లో ఒకవేళ గ్లామర్ పాత్రల్లో నటించాల్సి వస్తే మాత్రం ఫస్టే చైతూ తో పక్కా ఆ విషయం గురించి చర్చించాలన్నారట నాగార్జున. ఇదే విషయాన్ని నాగ చైతన్యకు కూడా చెప్పారట. ఏదైనా మూవీకి కమిట్‌మెంట్ ఇచ్చే ముందే ఒకరికొకరు చర్చించుకోవాలని చెప్పారట. తర్వాతే ఆ ప్రాజెక్ట్‌కు ఒకే చెప్పాలని అన్నారట. ఇవన్నీ ఇద్దరు ఆలోచించుకున్నాకే పెళ్లిపై నిర్ణయం తీసుకోండని నాగార్జున కండిషన్ పెట్టారట. శోభితా-చై వీటన్నింటికి ఓకే అన్నాక నిశ్చితార్థం జరిపించారట. మరీ ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.