నాగార్జున 14 సార్లు అలా చేయడంతో అక్కడ కందిపోయింది.. షాకింగ్ విషయాన్ని రివీల్ చేసిన హీరోయిన్..

by Mallepaka Hamsa |

ఒకప్పటి హీరోయిన్ ఇషా కొప్పికర్(Isha Koppikar) ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది.

నాగార్జున 14 సార్లు అలా చేయడంతో అక్కడ కందిపోయింది.. షాకింగ్ విషయాన్ని రివీల్ చేసిన హీరోయిన్..
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ ఇషా కొప్పికర్(Isha Koppikar) ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ ఓ స్టార్ హీరో తనను ఏకంగా 14 సార్లు కొట్టినట్లు చెప్పింది. అది కూడా తనే కొట్టించుకున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘చంద్రలేఖ(Chandralekha )నా రెండు సినిమా. అయితే ఇందులో ఓ సీన్‌లో హీరో నన్ను కొట్టాల్సి ఉంటుంది. దీంతో ఆ సన్నివేశం బాగా రావాలని నేనన నాగార్జున(Nagarjuna)తో నిజంగానే నన్ను కొట్టమని చెప్పాను. కానీ ఆయన అలా చేయకపోవడంతో సరిగ్గా రాలేదు. ఆ తర్వాత మళ్లీ నాకు కోపం రావడం లేదు.. మీరు గట్టిగా కొట్టండి అని నాగ్‌కు చెప్పాను.

ఆ సీన్ బాగా రావడం కోసం రిలేకులు తీసుకున్నారు. అలా దాదాపు 14 సార్లు నా చెంపపై ఆయన కొట్టారు. ఆ సీన్ అయ్యాక చూసుకుంటే నా మొహమంతా కందిపోయింది. చెంపమీద వాతలు కూడా పడ్డాయి. దీంతో నాగార్జున బాధపడి నాకు క్షమాపణలు చెప్పారు. నేను వద్దని చెప్పినా సన్నివేశం డిమాండ్ చేస్తే చేయక తప్పదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా, ఇషా కొప్పికర్, నాగార్జున, రమ్యకృష్ణ కలిసి నటించిన ‘చంద్రలేఖ’ బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది.

link

Next Story