- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగర్జున 100వ సినిమాలో రాజకీయాలు...ఇక థియేటర్లలో రచ్చ, రచ్చే !
పొలిటికల్ డ్రామా ముఖ్యమంత్రి సీటు కోసం ఈ సినిమా స్టోరీ మొత్తం తిరుగుతుందట. అంతేకాదు ఇందులో నాగార్జున రెండు పాత్రలో

దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగార్జున త్వరలో తన 100వ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే పనిలో నాగార్జున బిజీగా ఉన్నారట. ఈ సినిమాను కొత్త దర్శకుడు కార్తీక్ చేస్తున్నారు. నాగార్జున 100వ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కొడుకులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు కూడా ప్రత్యేక పాత్రలలో కనిపించబోతున్నారట. అంతేకాదు హీరోయిన్ టబు ఇందులో నటించనున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా గురించి కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా మొత్తం పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సీటు కోసం ఈ సినిమా స్టోరీ మొత్తం తిరుగుతుందట. అంతేకాదు ఇందులో అక్కినేని నాగార్జున రెండు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీఎం పాత్రలో ఒక హీరోయిన్ నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆ హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియ రాలేదు. త్వరలోనే ఫైనల్ కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు కింగ్ 100 అనే టైటిల్ అనుకుంటున్నారట. అటు 27 సంవత్సరాల తర్వాత నాగార్జున సరసన టబు నటిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ సినిమాపై వస్తున్న గాసిప్స్ అంచనాలను పెంచేస్తున్నాయి.






