ఒకరిని మరొకరు కంట్రోల్ చేయాలని చూసినప్పుడే బ్రేకప్స్ అవుతాయి.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 7 |
ఒకరిని మరొకరు కంట్రోల్ చేయాలని చూసినప్పుడే బ్రేకప్స్ అవుతాయి.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీ తరుఫున తన గొంతు వినిపిస్తున్న ఈయన.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య అసలు బ్రేకప్స్ ఎందుకు అవుతాయనే దానికి స్పందించి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు నాగబాబు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబుకు.. ‘ఒకప్పటి జనరేషన్లో చాలా అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్ అవ్వడం లాంటివి ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసిన బ్రేకప్‌లే వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి’ అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి స్పందించిన నాగబాబు.. ఇక్కడ అబ్బాయిలు ఒక మైండ్ సెట్ నుంచి పూర్తిగా డెవలప్ అవ్వలేదు. ఆడపిల్లలేమో.. చిన్నప్పటి నుంచి పెద్ద వారిని చూసి మీరు ఎందుకు అడ్జస్ట్ అవుతున్నారు..? నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనే ప్రశ్నలు వేస్తున్నారు. కాబట్టి.. భార్యాభర్తలు ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నప్పుడు, లేదా తన కంటే ఎక్కువ చదువుకున్న, సంపాదించిన ఆడపిల్లల్లో మేము ఎందుకు సర్దుకుపోవాలి.. మా మీద వాళ్లు ఎందుకు అధికారం చలాయిస్తారు అనే ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే ఒకరిని మరొకరు కంట్రోల్ చేయాలని చూస్తారో.. ముఖ్యంగా భార్యలను కంట్రోల్ చేయాలని చూస్తున్నప్పుడే ఇలాంటి బ్రేకప్‌లు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు.

Next Story