‘కింగ్‌డమ్’ వాయిదాపై స్పందించిన నాగవంశీ.. షాకింగ్ ట్వీట్ వైరల్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

‘కింగ్‌డమ్’ వాయిదాపై స్పందించిన నాగవంశీ.. షాకింగ్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం రౌడీ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఇందులో విజయ్ దేవరకొండ సరసన సెన్సేషన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ మొదవలగా ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల చిత్రబృందం రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు.

కానీ షూటింగ్ పూర్తి కానందున వాయిదా పడినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. జూలై 4న విడుదల కావాల్సి ఉండగా.. మూవీ టీమ్ సైలెంట్‌గా ఉండటంతో వాయిదా పడటం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, నాగవంశీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘నేను ఏం పోస్ట్ చేసినా ‘కింగ్‌డమ్’ సినిమా గురించి తిట్లు వస్తూనే ఉంటాయని నాకు తెలుసు. మీకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు మా టీమ్ ఎంతగారో కృషి చేస్తోంది. మీకు మాటిస్తున్నా. ‘కింగ్‌డమ్’ చూశాక మీకు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది.

నేను ఎంతో నమ్మితే కానీ ఇలా మాట్లాడనని మీకు తెలుసు. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా మీ క్రియేటివిటీ అంతా నాపై చూపిస్తారు. నేను సినిమా చూసి చెప్తున్నా. కింగ్‌డమ్‌దే గెలుసు. త్వరలోనే అదిరిపోయే రిలీజ్ డేట్, టీజర్, సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో కలుద్దాం’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు నిరాశ చెందుతున్నారు. మరీ ముఖ్యంగా రౌడీ హీరో ఫ్యాన్స్ మాత్రం ఇక ఈ సినిమా వచ్చినట్టే అని చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తిట్టుకుంటున్నారు.

link

Next Story